గోదావరిఖని, సెప్టెంబర్ 20 (ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల జేఏసీ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న గోదావరిఖనికి చెందిన మహమ్మద్ యూసుఫ్‌ను రామగుండం కార్పొరేషన్ ఏరియా ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు కార్పొరేషన్ ఏరియా అధ్యక్షుడు ఎస్.డి. బురహన్ తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ ఆదేశాల మేరకు ఈ నియామక ప్రక్రియ చేపట్టినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ సూచనల మేరకు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అన్ని ఆటో అడ్డాల్లో ఆటో జేఏసీ కమిటీలను ఏర్పాటు చేయాలని, భవిష్యత్ ఉద్యమాలకు ఆటో డ్రైవర్లను సిద్ధం చేయాలని మహమ్మద్ యూసుఫ్‌కు సూచించినట్లు తెలిపారు.
ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సంబంధించిన సమస్యల పరిష్కారం, ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం పోరాటాన్ని కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తనను రామగుండం కార్పొరేషన్ ఏరియా ప్రధాన కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, కార్పొరేషన్ కమిటీ నాయకులకు మహమ్మద్ యూసుఫ్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.
— ఆయుష్ 24 న్యూస్
The Voice of Truth










Leave a Reply