పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు మెరుగు చందర్ యాదవ్ సూచన
పెద్దపల్లి, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): తెలంగాణ రాజ్యాధికార పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే కార్యక్రమాల్లో భాగంగా రేషవేని రమేష్ యాదవ్‌ను రామగుండం మండల అధ్యక్షుడిగా నియమించారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ మాధం రజనీ కుమార్ యాదవ్ ఆదేశాలతో, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా సూచనల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ జిల్లా నాయకత్వం తెలిపింది.
పెద్దపల్లిలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మెరుగు చందర్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రేషవేని రమేష్ యాదవ్‌కు రామగుండం మండల అధ్యక్షుడిగా నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షులు మెరుగు చందర్ యాదవ్ అందజేశారు.
ఈ సందర్భంగా పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని నూతన మండల అధ్యక్షుడికి సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మెరుగు చందర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు సతీష్ గౌడ్, జిల్లా సంయుక్త కార్యదర్శి కాంపెల్లి స్వామి, జిల్లా కార్యదర్శి, పెద్దపల్లి మండల అధ్యక్షుడు కుమ్మరి పరమేష్, వెంగళ కృష్ణ మధు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply