మృతుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం
చందంపేట, ఆగస్టు 29 (అయుష్ 24 న్యూస్):
చందంపేట మండలం బొల్లారం గ్రామపంచాయతీకి చెందిన రామావత్ దుల్లి ఆకస్మికంగా మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకుడు వడ్త్య రమేష్ పరామర్శించారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని బీఆర్ఎస్ బొల్లారం నాయకుడు నేనావత్ నరసింహ నాయక్ చేతుల మీదుగా మృతుడి కుటుంబ సభ్యులకు అందించారు.
అనుకోని విషాదంతో బాధలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి, ఆర్థిక సహాయం అందించడం ద్వారా తమ మానవత్వాన్ని చాటుకున్నారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ నాయకులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు.
📰 అయుష్ 24 న్యూస్
THE VOICE OF TRUTH



Mahamood Mohammed






Leave a Reply