కొండమల్లేపల్లి, సెప్టెంబర్ 5 (అయుష్ 24 న్యూస్): కొండమల్లేపల్లి మండలం గౌరికుంట తండాకు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు రామావత్ రమేష్ నానమ్మ ఇటీవల మృతి చెందడంతో, బీఆర్‌ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకుడు వడ్త్య రమేష్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
దశదిన కర్మ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గౌరికుంట తండాలోని వారి స్వగ్రామానికి వెళ్లిన వడ్త్య రమేష్, మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించారు.

ఈ కార్యక్రమంలో పెద్దిశెట్టి సత్యం, కొండమల్లేపల్లి సర్పంచ్ అభ్యర్థి శివగౌడ్, భీమా, కోటేష్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply