పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
పరిగి, సెప్టెంబర్ 1, 2026 | అయుష్ 24 న్యూస్: పరిగి నియోజకవర్గంలో ప్రజల పక్షాన పోరాటానికి బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధమైందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తెలిపారు.
బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలోని వైఫల్యాలను, 6 గ్యారంటీలు, 420 హామీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ పరిగి నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలపై మంగళవారం పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని కొప్పుల మహేష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో విసిగిపోయారని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని తిరిగి కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు రాబోయే రోజుల్లో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
అయుష్ 24 న్యూస్ 📰










Leave a Reply