పీఆర్సీ, పెండింగ్ డీఏలు, ఇతర ఆర్థిక బకాయిలపై చర్చ
అమరావతి, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (శనివారం) ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం.
ఈ సమావేశంలో ప్రధానంగా పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్సీ బకాయిలు, ఇతర ఆర్థిక బకాయిలు తదితర ఉద్యోగుల సమస్యలపై చర్చించే అవకాశం ఉంది.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం. తాజాగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి స్థాయిలో సమావేశం ఖరారు కావడంతో పెండింగ్ సమస్యలపై ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయన్న దానిపై ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ముఖ్యంగా పీఆర్సీ, డీఏ బకాయిలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.









Leave a Reply