Monday, 14 Sep 2026
14 Sep 2026Monday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › రేపు పరకాలకు సీఎం రేవంత్ రెడ్డి.. సభా స్థలాన్ని పరిశీలించిన డీసీసీ అధ్యక్షులు
బ్రేకింగ్ న్యూస్

రేపు పరకాలకు సీఎం రేవంత్ రెడ్డి.. సభా స్థలాన్ని పరిశీలించిన డీసీసీ అధ్యక్షులు

12:35 మధ్యాహ్నం PM

ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, అయ్యూబ్ అలీ క్షేత్రస్థాయిలో పరిశీలన

పరకాల | హనుమకొండ జిల్లా | అయుష్ 24 న్యూస్

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు పర్యటించనున్నారు. సీఎం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని పరకాలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభా స్థలి, సభా వేదికతో పాటు సీఎం పాల్గొనే వివిధ కార్యక్రమాల ప్రదేశాలను హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షులు అయ్యూబ్ అలీ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా సభా ఏర్పాట్లను పరిశీలించిన వారు సంబంధిత అధికారులు, పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు.

సీఎం పర్యటనను, భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, అయ్యూబ్ అలీ పిలుపునిచ్చారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

— అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
721 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *