జనరల్ బాడీ సమావేశం, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. హాస్టల్ వార్డెన్లతో సమీక్ష
పరిగి, ఆగస్టు 31, అయుష్ 24 న్యూస్: పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి మంగళవారం (సెప్టెంబర్ 1) పరిగి నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు పరిగి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారు. అనంతరం 11 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని హాస్టల్ వార్డెన్లతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
అనంతరం పరిగి మండలంలోని పలు క్లస్టర్లలో నిర్వహించే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి పాల్గొంటారు.
📍 క్లస్టర్ల వారీగా కార్యక్రమాల వివరాలు
- మధ్యాహ్నం 12:00 గంటలకు: గడిసింగాపూర్ క్లస్టర్ – గడిసింగాపూర్ రైతు వేదిక
- మధ్యాహ్నం 1:00 గంటలకు: ఖుదావంద్పూర్ క్లస్టర్ – రాపోల్ రైతు వేదిక
- మధ్యాహ్నం 2:00 గంటలకు: మాధారం క్లస్టర్ – రంగాపూర్ రైతు వేదిక
- మధ్యాహ్నం 3:00 గంటలకు: చిగురాల్పల్లి క్లస్టర్ – చిగురాల్పల్లి రైతు వేదిక
- సయ్యద్పల్లి క్లస్టర్: సయ్యద్పల్లి రైతు వేదిక
ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, పార్టీ కార్యకర్తలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొనాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.
అయుష్ 24 న్యూస్ | The Voice of Truth










Leave a Reply