కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన వైఫల్యాలకు నిరసనగా ర్యాలీ
పరిగి, సెప్టెంబర్ 1, 2026 | అయుష్ 24 న్యూస్: బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన వైఫల్యాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2, 2026న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు.
🟣 ర్యాలీ వివరాలు
📅 తేదీ: 02-09-2026
⏰ సమయం: ఉదయం 9:30 గంటలకు
📍 ప్రారంభం: కొడంగల్ చౌరస్తా
➡️ ముగింపు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో జరిగిన వైఫల్యాలను నిరసిస్తూ ఈ భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు KMR (Ex.MLA Office), పరిగి తెలిపింది.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ అధ్యక్షులు, మాజీ ZPTCలు, MPPలు, వైస్ MPPలు, మాజీ PACS చైర్మన్లు, AMC చైర్మన్లు, వైస్ చైర్మన్లు, రైతు బంధు సమన్వయ అధ్యక్షులు, MPTCలు, కౌన్సిలర్లు, యూత్ అధ్యక్షులు, PACS డైరెక్టర్లు, బీఆర్‌ఎస్ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, కో-ఆప్షన్ సభ్యులు, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు, మైనారిటీ సోదరులు, గిరిజన సోదరులు, మహిళా నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.
పరిగి నియోజకవర్గంలో ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ చేపడుతున్న ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
KMR (Ex.MLA OFFICE)
PARIGI
అయుష్ 24 న్యూస్ 📰










Leave a Reply