దోమ, పూడూరు మండలాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. కొడంగల్‌లో SIR-2పై అవగాహన సదస్సు
పరిగి, ఆగస్టు 23, అయుష్ 24 న్యూస్: పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఈ నెల 24వ తేదీ సోమవారం దోమ, పూడూరు మండలాల్లో పర్యటించనున్నారు.
పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు, కొడంగల్‌లో SIR-2పై అవగాహన సదస్సులో పాల్గొననున్నారు.
దోమ మండలంలో పర్యటన
ఉదయం 9:00 గంటలకు: దోమ మండల కేంద్రంలోని రైతు వేదికలో జనరల్ బాడీ మీటింగ్, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.
అనంతరం దోమ మండలంలోని పలు గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
- 10:00 గంటలకు: శివారెడ్డిపల్లి గ్రామ రైతు వేదిక
- 10:20 గంటలకు: మోత్కూర్ గ్రామ రైతు వేదిక
- 11:00 గంటలకు: దాదాపూర్ గ్రామ రైతు వేదిక
- 11:20 గంటలకు: బ్రాహ్మణపల్లి గ్రామ రైతు వేదిక
- మధ్యాహ్నం 12:00 గంటలకు: కొడంగల్‌లో SIR-2పై అవగాహన సదస్సు
పూడూరు మండలంలో పర్యటన
మధ్యాహ్నం 2:00 గంటలకు: పూడూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో జనరల్ బాడీ మీటింగ్, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారు.
అనంతరం పలు గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
- 3:00 గంటలకు: చనుగోముల్ రైతు వేదిక
- 3:40 గంటలకు: కంకల్ గ్రామ రైతు వేదిక
- 4:00 గంటలకు: పెద్ద ఉమెంతాల్ గ్రామం
- 5:00 గంటలకు: మంచన్‌పల్లి రైతు వేదిక
ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, పార్టీ కార్యకర్తలు, అలాగే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొనాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.
— ఎమ్మెల్యే టీఆర్‌ఆర్ కార్యాలయం, పరిగి
అయుష్ 24 న్యూస్










Leave a Reply