ఇల్లందు, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: లచ్చగూడెం గ్రామంలో కల్తీ రవి నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. సొంత ఇల్లు ప్రతి కుటుంబానికి ఆత్మవిశ్వాసం, భరోసాను కల్పిస్తుందని పేర్కొన్నారు.
నూతన గృహంలో కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో లచ్చగూడెం సర్పంచ్ వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply