ఇల్లందు, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: లచ్చగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులకు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య శ్రీకారం చుట్టారు. గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించిన కల్వర్ట్, సైడ్ డ్రైన్‌కు సంబంధించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని చెప్పారు.
గ్రామ అభివృద్ధికి అవసరమైన మరిన్ని పనులను దశలవారీగా చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో లచ్చగూడెం సర్పంచ్ ఎదలపల్లి వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
“ప్రజా సంక్షేమమే లక్ష్యం.. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం” – కోరం కనకయ్య, ఎమ్మెల్యే










Leave a Reply