Monday, 14 Sep 2026
14 Sep 2026Monday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో మీల్స్ అండ్ వీల్స్ (అల్పాహారం పంపిణీ)
బ్రేకింగ్ న్యూస్

లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో మీల్స్ అండ్ వీల్స్ (అల్పాహారం పంపిణీ)

09:24 ఉదయం AM

దేవరకొండ, ఆగస్టు 27, ఆయుష్ 24 న్యూస్: ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టి, వారికి బాసటగా నిలవాలనే సంకల్పమే లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ముఖ్య ఉద్దేశమని క్లబ్ ప్రెసిడెంట్ లయన్ గుద్దేటి జంగయ్య అన్నారు.

లయన్ కుంచకూరి శంకర్ కుమారుడు చిరంజీవి రియాన్స్ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సుమారు 300 మంది పేషెంట్లు, వారి అటెండర్లకు కిచిడీ అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా లయన్ గుద్దేటి జంగయ్య మాట్లాడుతూ, ఆకలితో ఉన్న వారికి అల్పాహారం అందించడం గొప్ప సేవా కార్యక్రమమని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. లయన్స్ క్లబ్ సభ్యుల వివాహ వార్షికోత్సవాలు, జన్మదినాలు, ఇతర ముఖ్యమైన సందర్భాల్లో వారి ఆర్థిక సహకారంతో పేదలు, నిరుపేదల ఆకలి తీర్చేందుకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ లయన్ గుద్దేటి జంగయ్య, ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారి చిలుకూరి కాశీనాథ్, జోన్ చైర్మన్ గాజుల ఉషారాణి, సీనియర్ లయన్స్ గాజుల రాజేష్, తిప్పర్తి రుక్మారెడ్డి, వస్కుల సత్యనారాయణ, నల్లమాద నారాయణరెడ్డి, అవిరినేని వెంకటేశ్వరరావు, లకుమారపు మల్లయ్య, నీల బుచ్చయ్య, వనం శ్రీనివాసులు, అలుగుబెల్లి జయపాల్ రెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 18🔗 Shares: 3👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
721 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *