సేవా కార్యక్రమాలకు స్పందిస్తున్న పట్టణ ప్రజలు
చిన్నారి గమ్యశ్రీ జన్మదినం సందర్భంగా అల్పాహారం పంపిణీ
దేవరకొండ, ఆగస్టు 31 (అయుష్ 24 న్యూస్): లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీల్స్ ఆన్ వీల్స్ సేవా కార్యక్రమాలకు పట్టణ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని క్లబ్ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య తెలిపారు.

లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను పత్రికల్లో చూసిన పట్టణానికి చెందిన గుండ మహేందర్–శ్వేత దంపతులు, తమ చిన్న కుమార్తె గమ్యశ్రీ జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన రోగులు, వారి సహాయకులకు అల్పాహారం అందించాలని ముందుకు వచ్చారని తెలిపారు.
వారి ఆర్థిక సహకారంతో సోమవారం ఆసుపత్రి వద్ద సుమారు 300 మందికి కిచిడీ పంపిణీ చేసినట్లు జంగయ్య తెలిపారు. లయన్స్ క్లబ్ సభ్యులతో పాటు సమాజంలోని వ్యాపారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ఇతరులు కూడా సేవా కార్యక్రమాలకు ముందుకు వస్తుండటం సంతోషకరమన్నారు.

ఈ సందర్భంగా చిన్నారి గమ్యశ్రీకి లయన్స్ క్లబ్ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సేవా కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన గుండ మహేందర్–శ్వేత దంపతులను క్లబ్ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారి చిలుకూరి కాశీనాథ్, జోన్ చైర్మన్ గాజుల ఉషారాణి, గాజుల రాజేష్, చిదళ్ళ వెంకటేశ్వర్లు, లకుమారపు మల్లయ్య, నీల బుచ్చయ్య, కర్నాటి గోవర్ధన్, దినేష్, అలుగువెల్లి జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్



Musini.Anjan





Leave a Reply