లయన్స్ క్లబ్ ఆఫ్ హయత్ నగర్ లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ సేవలు అభినందనీయం
కుంచకూరి యాదయ్య ఆర్థిక సహాయంతో 2000 నోటు బుక్స్ పెన్నులు పంపిణీ
దేవరకొండ సెప్టెంబర్ 8 ఆయుష్ 24 న్యూస్
లయన్స్ క్లబ్ హయత్ నగర్ లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో మంగళవారం దేవరకొండ పిఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల బచ్పన్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ హైస్కూల్లో హయత్ నగర్ లయన్స్ క్లబ్ డైరెక్టర్ కుంచకూరి యాదయ్య ఆర్థిక సహాయంతో దేవరకొండ పట్టణానికి చెందిన విద్యార్థులకు నోటుబుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 320 ఈ లయన్ ఎం జె ఎఫ్ కెవి ప్రసాద్ ,ఫాస్ట్ గవర్నర్ గార్లపాటి జితేందర్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాలలో లయన్ క్లబ్ ప్రెసిడెంట్ గుద్దేటి జంగయ్య ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి కోశాధికారి చిలుకూరి కాశీనాథ్ కలిసి మాట్లాడుతూ విద్యార్థులు మంచి లక్ష్యాలను ఎంచుకొని ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేయాలని ప్రతి విద్యార్థి కామ తమ తమ స్థానాలలో ఎదిగిన తర్వాత లైన్స్ క్లబ్ లాంటి సంస్థలలో చేరి పేదలకు విద్యా వైద్యం ఆరోగ్యం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు చిన్నతనం నుండి విద్యార్థులకు సేవ ధర్మం గురించి ఉపాధ్యాయులు తెలియజేయాలని కోరారు. ప్రతి విద్యార్థుల్లో ఉన్న శక్తిని వెలికి తీయడం కోసం కృషి చేయాలని తెలిపారు లయన్స్ క్లబ్ 120 సంవత్సరాలుగా ఏకతాటిగా ఒకే ఎజెండాతో పని చేస్తుందని తెలిపారు ప్రపంచంలో ఎలాంటి విపత్తులు వచ్చిన లయన్స్ క్లబ్ తన వంతుగా మందులు ఆహారం దుస్తులు అందజేస్తుందని తెలిపారు ఇటీవల నేపాల్ లో వరదలు వస్తే వారిని ఆదుకోవడం కోసం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు .

ఉపాధ్యాయులను సన్మానించిన లయన్స్ క్లబ్బులు
సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని వారోత్సవాలలో భాగంగా దేవరకొండ పట్టణంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బచ్పన్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ హై స్కూల్ లోని ఉపాధ్యాయులను ఘనంగా శాలువలతో సన్మానించి జ్ఞాపికలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యా బోధనతో పాటు విలువలను నేర్పిస్తారని తెలిపారు తాము సైతం దేవరకొండ పట్టణంలోని పాఠశాలల్లో చదువుకొని ఉన్నత స్థానంలో స్థిరపడినట్లు తెలిపారు. ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరు గౌరవించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బచ్పన్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ చైర్మన్ ఇల్లెందుల శ్రవణ్ కుమార్, చీదెళ్ళ వెంకటేశ్వర్లు, హయత్నగర్ లయన్స్ క్లబ్ డైరెక్టర్ కుంచకూరి యాదయ్య, వనపర్తి మురళి జి. విజయలక్ష్మి ,వనపర్తి రూప, వనపర్తి రమేష్, కే. శ్రీధర్, సముద్రాల ప్రభాకర్, డాక్టర్ పి జె సామ్ సన్, కడారి బలరాం యాదవ్ ,దినేష్, తదితరులు పాల్గొన్నారు.



Musini.Anjan





Leave a Reply