మోహన్ రెడ్డి సేవలను స్మరించుకోవడం మన బాధ్యత: ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ | అయుష్ 24 న్యూస్
దేవరకొండ మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లోకసాని శ్రీధర్ రెడ్డి తండ్రి లోకసాని మోహన్ రెడ్డి సంవత్సరిక కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ శనివారం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోహన్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే బాలు నాయక్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, మోహన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. లోకసాని మోహన్ రెడ్డి సేవలను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ తమ సహకారం, అండదండలు ఉంటాయని తెలిపారు. కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో లోకసాని కుటుంబ సభ్యులు, బంధువులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని మోహన్ రెడ్డి జ్ఞాపకాలను స్మరించుకున్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply