13వ వార్డు బీఆర్ఎస్ నాయకుడు సతీష్‌తో పాటు అనుచరుల భేటీ
దేవరకొండ: దేవరకొండ పట్టణంలోని 13వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సతీష్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకుడు వడ్త్య రమేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
దేవరకొండలోని వడ్త్య రమేష్ నివాసంలో జరిగిన ఈ భేటీలో సతీష్‌తో పాటు ఆయన అనుచరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్త్య రమేష్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన పలు అంశాలపై నాయకులు పరస్పరం చర్చించుకున్నట్లు తెలిపారు. స్థానికంగా పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని వడ్త్య రమేష్ సూచించినట్లు సమాచారం.
ఈ కార్యక్రమంలో 13వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సతీష్ అనుచరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్










Leave a Reply