వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణదేవుడిని వేడుకోనున్న ఉమ్మడి మైనంపల్లి గ్రామాల ప్రజలు

- దేవరకొండ, ఆగస్టు 23, అయుష్ 24 న్యూస్:
“వానమ్మ వానమ్మ… ఒక్కసారైనా వచ్చి పోరాదే వానమ్మ…” అంటూ వర్షాలు కురవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతుల కళ్లల్లో ఆనందం నిండాలని ఉమ్మడి మైనంపల్లి గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. వర్షాలతోనే పంటలు, పశుపక్షాదులు, చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండి తాగునీటి సమస్యలు తీరుతాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు.ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు వరి తదితర పంటలు సాగు చేసినప్పటికీ, సరైన సమయంలో వర్షాలు లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఉమ్మడి మైనంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రైతులు, గ్రామస్తులు ఆకాశం వైపు చూస్తూ తమ పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. వర్షాలు కురవాలని కోరుతూ పాండవుల బండ వద్ద ‘వరద పాశం’ పోసి గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సంప్రదాయం అనంతరం వర్షాలు కురుస్తాయని తమకు విశ్వాసం ఉందని గ్రామస్తులు తెలిపారు.వర్షం కోసం అనాదిగా వస్తున్న సంప్రదాయానికి శ్రీకారంమైనంపల్లి సర్పంచ్, దేవరకొండ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొర్ర రామ్‌సింగ్ నాయక్ నేతృత్వంలో ఈ నెల 30వ తేదీ ఆదివారం వరద పాశం కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.వర్షంతోనే జీవనాధారంవర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ నెల 30న ఉమ్మడి మైనంపల్లి గ్రామాలకు చెందిన రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాండవుల బండ వద్దకు చేరుకుని వరద పాశం పోసి గ్రామదేవతలకు పూజలు నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంపై మైనంపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో అంబటి వానిగూడెం సర్పంచ్ హరికృష్ణ, శకృతండా సర్పంచ్ మోహన్‌లాల్తో పాటు వివిధ గ్రామాలకు చెందిన పెద్దమనుషులు పాల్గొని కార్యక్రమ నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు.రైతుల పాడిపంటలు సమృద్ధిగా పండాలని, చెరువులు, కుంటలు నిండాలని, ప్రజలకు తాగునీటి కొరత లేకుండా వరుణదేవుడు కరుణించాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.
- — AYUSH24 NEWS










Leave a Reply