పాడి పంటలు సమృద్ధిగా పండాలని.. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు
దేవరకొండ, ఆగస్టు 31, అయుష్ 24 న్యూస్: గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని కోరుతూ పాత్లావత్ తండా (పి) గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తండాకు చెందిన గిరిజనులంతా ఒకే వేదికపైకి చేరుకుని ఆంజనేయస్వామి దేవాలయంలో ఆంజనేయస్వామి, బొడ్రాయి, వరుణ దేవునికి గ్రామ బావోజీల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామదేవతలకు నైవేద్యాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పాత్లావత్ (పి) తండా మాజీ సర్పంచ్ పాతావత్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. విత్తనాలు వేసి రైతులు వరుణ దేవుని కరుణ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో పంట నష్టంతో రైతులతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.

వేసిన పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరుణ దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించి రైతులను, ప్రజలను చల్లగా చూడాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాబూజీ వాంకునావత్ సోమ్లా, గ్రామ సర్పంచ్ భారతి ధర్మానాయక్, కాలియా సోమ్లా, చందు, బుజ్జి, దేవి, శాలి చక్రి తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ | The Voice of Truth



Musini.Anjan





Leave a Reply