నాగరిగారి ప్రీతం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి
హైదరాబాద్, సెప్టెంబర్ 08:
హైదరాబాద్‌లోని చెంగిచెర్లలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగరిగారి ప్రీతం మాతృమూర్తి వసంత రాణి ఇటీవల మృతి చెందారు. ఆమె దశదిన కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వసంత రాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి, అనంతరం నాగరిగారి ప్రీతం, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
అయుష్ 24 న్యూస్ ప్రతినిధి, హైదరాబాద్









Leave a Reply