బ్రహ్మం శిటో-రియో కరాటే అకాడమీలో వేడుకలు
ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు
విజయవాడ: బ్రహ్మం శితో-రియో కరాటే అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు ముఖ్య అతిథిగా హాజరై, కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తన చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. కరాటే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను పెంపొందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
అవార్డులు అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అకాడమీ నిర్వాహకులు ముఖ్య అతిథిని సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply