మంథని, ఆగస్టు 25 – అయుష్ 24 న్యూస్
మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థులకు గ్రామ సర్పంచ్ దండేవేన సంధ్య బానేష్ తన సొంత ఖర్చులతో ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ దండేవేన సంధ్య బానేష్ మాట్లాడుతూ.. తమను సర్పంచ్‌గా గెలిపించిన గ్రామ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం తన వంతు సహాయం ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు.
మంథని నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ప్రోత్సాహంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు.
విద్యార్థుల సౌకర్యార్థం ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేయడంపై గ్రామస్తులు సర్పంచ్‌ను అభినందించారు.










Leave a Reply