జాతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరాల వంశీ
హైదరాబాద్, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో బీసీ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరాల వంశీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చేరాల వంశీ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ధైర్యసాహసాలు, ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటం నేటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
విద్యార్థులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ను ఆదర్శంగా తీసుకుని విద్యపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని కష్టపడి చదివి విద్యారంగంలో రాణించాలని సూచించారు. సమాజ అభివృద్ధిలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని అన్నారు.
విద్యతో పాటు సామాజిక బాధ్యతను కూడా గుర్తించి సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం, న్యాయం కోసం విద్యార్థులు ముందుకు రావాలని చేరాల వంశీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొన్మనబోయిన సైదులు యాదవ్, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రవి కుమార్, శ్రీధర్ యాదవ్, సాయి, విద్యార్థి నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply