ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్యకు నిరసనగా దేవరకొండలో ఎస్‌ఎఫ్‌ఐ క్యాండిల్ ర్యాలీ
దేవరకొండ, ఆగస్టు 22, అయుష్ 24 న్యూస్: కొండమల్లేపల్లి ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్య ఘటనపై ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విద్యార్థులు హంతకులుగా మారడం సమాజంలో తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్త క్యాండిల్ ర్యాలీలో భాగంగా దేవరకొండ పట్టణ కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రూపా రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు.
రూపా రెడ్డి హత్య అత్యంత విషాదకరమైన ఘటన అని, ఇలాంటి సంఘటనలు సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తున్నాయని నాయకులు అన్నారు. విద్యార్థుల్లో మానవీయ విలువలు, క్రమశిక్షణ, నైతిక బాధ్యతలను పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మృతురాలి కుటుంబ సభ్యులకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొని రూపా రెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు.










Leave a Reply