ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహణ
మంథని, సెప్టెంబర్ 3 | అయుష్ 24 న్యూస్
మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గురువారం ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నిర్వహించిన ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బాలోజీ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని చదువులో ఉన్నత ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇటీవల ప్రభుత్వం విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిందని, త్వరలో మధ్యాహ్న భోజనం కూడా అందించనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ విద్యపై మరింత దృష్టి సారించాలని సూచించారు.
అనంతరం విద్యార్థినులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు అందరినీ విశేషంగా అలరించాయి. నూతన విద్యార్థినులకు సీనియర్ విద్యార్థినులు ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ డే వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జాన్సీ, తిరుపతి, రావుల తిరుమల్, శశాంక్, శ్రీదేవి, నగేష్, ఎల్.ఆర్.కె. రెడ్డి, మౌనిక, సబిత, అతిథి అధ్యాపకులు సురేష్, దీపారాణి, సిబ్బంది బియ్యబాని, రాజయ్య, అర్జయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్









Leave a Reply