పైడిపల్లి ప్రభుత్వ పాఠశాలకు 50 బెంచీలు అందించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
వెల్గటూరు, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా వెల్గటూరు మండలం పైడిపల్లి ప్రభుత్వ పాఠశాలకు విశాఖ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 50 బెంచీలను ఎంపీ గడ్డం వంశీకృష్ణ అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. గత 35 ఏళ్లుగా ప్రజాసేవ కొనసాగిస్తున్నామని, భవిష్యత్తులోనూ ఇదే విధంగా సేవలను కొనసాగిస్తామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అవసరమైన ప్రాంతాల్లో బోర్‌వెల్స్‌తో పాటు ఇతర సౌకర్యాలను కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పాఠశాలకు 50 బెంచీలను అందించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణంలో విద్యనభ్యసించేందుకు ఈ సదుపాయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.










Leave a Reply