దేవరకొండలో శాంతి సమావేశం
దేవరకొండ సెప్టెంబర్ 9 ఆయుష్ 24 న్యూస్
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవరకొండ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో శాంతి సమావేశం సబ్ కలెక్టర్ కరోలిన్ బుధవారం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు సంఘాల నాయకులు మండల నిర్వాహకులు హాజరయ్యారు సబ్ కలెక్టర్ కరోలిన్ మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో శాంతిభద్రతలకు విఘాతం కలవకుండా అన్ని మతాలను గౌరవిస్తూ వినాయక చవితిని జరుపుకోవాలని సూచించారు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులతో ఏర్పాట్ల పర్యవేక్షణను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పీస్ కమిటీలో రాజకీయ నాయకులు మాట్లాడుతూ నిమజ్జనం వద్ద విద్యుత్తు లైట్లను ఏర్పాటు చేయాలని తెలిపారు రోడ్ల వెంట వేలాడే విద్యుత్ వైర్లను తొలగించాలని రోడ్లకు ఇరువైపులా మట్టిని పోయాలని సూచించారు. వివిధ మతాలకు సంబంధించిన నాయకులు మాట్లాడుతూ పండగలను ఏ మతం వారైనా ఇతర మతాలను గౌరవిస్తూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ డిఎస్పి శ్రీనివాసరావు సిఐ వెంకట్ రెడ్డి తహసిల్దార్ సంజీవ్ కుమార్ వివిధ శాఖల అధికారులు వివిధ పార్టీల నాయకులు మండప నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.




Musini.Anjan





Leave a Reply