హైదరాబాద్, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): హైదరాబాద్లోని జెడ్పీ రోడ్డు, హస్తినాపురం ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని పీసీసీ సభ్యులు, PACS చైర్మన్ జాలే నరసింహారెడ్డి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జాలే నరసింహారెడ్డి మాట్లాడుతూ, దేవరకొండ నియోజకవర్గ ప్రజలపై గణనాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. సకాలంలో వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
అనంతరం వినాయక మండపం కమిటీ సభ్యులు జాలే నరసింహారెడ్డిని శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమంలో హరీష్ రెడ్డి, రోహిత్, శ్రీనివాస్ యాదవ్, మహేష్, పవన్, శ్రీనివాసరెడ్డి, కిరణ్, రాకేష్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.
AYUSH 24 NEWS
The Voice of Truth










Leave a Reply