నిర్వాహకుల సౌకర్యార్థం ఆన్లైన్లోనే అనుమతులు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
అమరావతి, సెప్టెంబర్ 3 | అయుష్ 24 న్యూస్
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ సింగిల్ విండో ఈ-పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
www.ganeshutsav.net పోర్టల్ ద్వారా వినాయక మండపాల నిర్వాహకులు వివిధ ప్రభుత్వ శాఖల అనుమతులను ఆన్లైన్లోనే పొందే అవకాశం కల్పించినట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.
వివిధ శాఖల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. అవసరమైన అనుమతుల కోసం ఈ-పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధంగా వ్యవస్థను రూపొందించినట్లు డీజీపీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు నిర్వాహకులు నిబంధనలను పాటిస్తూ ముందస్తుగా అనుమతులు పొందాలని పోలీసు శాఖ సూచించింది.
— అయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్










Leave a Reply