నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి
కరీంనగర్: కరీంనగర్‌లోని వసుధ కన్వెన్షన్‌లో నిర్వహించిన కమాన్‌పూర్ ఎంపీడీవో సాధనవేనా ప్రియాంక – వరుణ్ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను మంత్రి ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం కరీంనగర్ పట్టణంలోని శుభం గార్డెన్‌లో నిర్వహించిన నిఖిల్ – సంజన మైత్రి రిసెప్షన్ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
అయుష్ 24 న్యూస్









Leave a Reply