నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే
పరిగి, ఆగస్టు 23, అయుష్ 24 న్యూస్: పరిగి నియోజకవర్గ పరిధిలోని పరిగి, కుల్కచర్ల, దోమ మండలాల్లో నిర్వహించిన పలు వివాహ వేడుకల్లో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివాహ వేడుకలకు హాజరైన ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. వధూవరుల కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply