మన్నెగూడ త్రిపూర (ఎంబీఆర్) గార్డెన్లో నూతన వధూవరులకు ఆశీర్వాదం
పూడూరు, ఆగస్టు 23, అయుష్ 24 న్యూస్: పూడూరు మండల పరిధిలోని మన్నెగూడ త్రిపూర (ఎంబీఆర్) గార్డెన్లో నిర్వహించిన వివాహ వేడుకల్లో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివాహ వేడుకకు హాజరైన ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. అనంతరం వధూవరుల కుటుంబ సభ్యులను కలిసి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply