Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › వెన్నచేడ్‌లో నాలుగు బోర్లు సక్సెస్.. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు
బ్రేకింగ్ న్యూస్

వెన్నచేడ్‌లో నాలుగు బోర్లు సక్సెస్.. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు

12:36 మధ్యాహ్నం PM

ఎంపీ నిధులతో చేపట్టిన బోర్ల తవ్వకాల్లో సమృద్ధిగా నీటి లభ్యత

గండీడ్, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎంపీ నిధులతో చేపట్టిన బోర్ల తవ్వకం పనుల్లో మంచి ఫలితాలు లభిస్తున్నాయి. గత రెండు రోజులుగా గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన బోర్ల తవ్వకాల్లో నీటి లభ్యత కనిపించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో ఇప్పటివరకు తవ్విన నాలుగు బోర్లలోనూ నీటి లభ్యత ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. తాజాగా గణేష్ నగర్ కాలనీలో తవ్విన మూడో బోర్, శ్రీరామ్ నగర్ కాలనీలో తవ్విన నాలుగో బోర్‌లోనూ సమృద్ధిగా నీరు లభించినట్లు పేర్కొన్నారు.

వరుసగా బోర్లలో నీటి లభ్యత కనిపించడంతో గణేష్ నగర్, శ్రీరామ్ నగర్ కాలనీలతో పాటు గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వెన్నచేడ్ గ్రామానికి ఎంపీ నిధులు మంజూరు చేసిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డికి గ్రామ ప్రజలు, కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. బోర్ల తవ్వకం పనులను పర్యవేక్షిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులు డా. వెన్న ఈశ్వరప్పకు కూడా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య, గ్రామ పెద్దలు జి. రాములు, భాస్కర్, మండల ప్రధాన కార్యదర్శి గడ్డమీది మల్కయ్య, మాజీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు చాకలి బాలయ్య, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు దొడ్డే రాములు, మాజీ ఎంపీటీసీ రేణుక దశరథ్, గ్రామ వార్డు సభ్యులు కాకి ఆంజనేయులు, సాయిలు, చెన్నయ్యతో పాటు గ్రామ బీజేపీ నాయకులు రాములు, గోపాల్, నరేందర్, శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, అంజి, గ్రామ పారిశుద్ధ్య కార్మికులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 6🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
42 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *