అనారోగ్యంతో బాధపడుతున్న సుందిళ్లకు చెందిన సత్యనారాయణ గౌడ్‌కు మంత్రి శ్రీధర్ బాబు భరోసా
మంథని, సెప్టెంబర్ 7 – అయుష్ 24 న్యూస్ ప్రతినిధి:
అనారోగ్యంతో బాధపడుతున్న మంథని నియోజకవర్గం రామగిరి మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన కొరకొప్పుల సత్యనారాయణ గౌడ్ వైద్య చికిత్స కోసం రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ (Letter of Credit) మంజూరైంది.
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ఈ ఆర్థిక సహాయం మంజూరైనట్లు మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో సత్యనారాయణ గౌడ్ చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందించాలని వారు కోరగా, మంత్రి శ్రీధర్ బాబు స్పందించి CMRF ద్వారా రూ.2,50,000 ఎల్‌ఓసీ మంజూరు చేయించినట్లు తెలిపారు.
మంజూరైన ఎల్‌ఓసీకి సంబంధించిన పత్రాలను హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆస్పత్రి సహాయకులు సత్యనారాయణ గౌడ్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
వైద్య చికిత్స సమయంలో ఆర్థిక సహాయం అందించేందుకు చొరవ తీసుకున్న మంత్రి శ్రీధర్ బాబుకు సత్యనారాయణ గౌడ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
అయుష్ 24 న్యూస్









Leave a Reply