రాజకీయాల్లో వ్యక్తిత్వమే ప్రధానమని బీజేపీ నేత చంద్రుపట్ల సునీల్ రెడ్డి వ్యాఖ్య
మంథని, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): రాజకీయాల్లో ఉన్నవారికి వ్యక్తిత్వం, విలువలు ముఖ్యమని, స్వార్థ రాజకీయాల కోసం ప్రత్యర్థులపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు.
మంథనిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు నాయకులు వ్యక్తిగత విమర్శలు, అసత్య ప్రచారాలకు పాల్పడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని సునీల్ రెడ్డి ఆరోపించారు. ఎదుటివారిపై వ్యక్తిగత దూషణలు, బురదజల్లే రాజకీయాలను మానుకోవాలని సూచించారు.
ప్రజాసేవలో తమ కుటుంబానికి సుదీర్ఘ చరిత్ర ఉందని సునీల్ రెడ్డి తెలిపారు. సీఎన్ రెడ్డి, నారాయణ రెడ్డి వంటి పెద్దల సిద్ధాంతాలు, విలువలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. గత 15 ఏళ్లుగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని చెప్పారు.
సమాజహితం కోసం గ్రామపంచాయతీ ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి 10 ఎకరాల భూమిని, దేవాలయ నిర్మాణానికి మరో భూమిని విరాళంగా అందించినట్లు ఆయన తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహించామని, బ్యాంకులు, ఆసుపత్రుల ఏర్పాటుకు సహకరించామని పేర్కొన్నారు.
గోదావరి వరదలు, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచి సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు సునీల్ రెడ్డి వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారం, సమాజహితం లక్ష్యంగా తమ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్, పట్టణ ప్రధాన కార్యదర్శులు సామంతుల అశోక్, భూసారపు తిరుపతి, నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జులు ఎడ్ల సాగర్, మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు బొల్లింపల్లి లక్ష్మణ్, అయిటి మల్లేష్, కార్యదర్శి పార్వతి విష్ణు, పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కుడ్ల గురుతేజ్, మండల ఉపాధ్యక్షుడు ఎలవేని సమ్మయ్య, నాయకులు సాయి, శ్రీకాంత్, చందు, కొలక నరసయ్య, కెర్రె నాగయ్య, సోమారం సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply