ఇల్లందు, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: శంబునిగూడెం గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులకు మరో అడుగు పడింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవన ప్రారంభోత్సవంతో పాటు సైడ్ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని నూతన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని తెలిపారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు.
అంగన్వాడీ భవనం అందుబాటులోకి రావడంతో చిన్నారులకు, తల్లులకు మెరుగైన సేవలు అందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి చేపడుతున్న పనులపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోరం సురేందర్, సర్పంచ్ భట్టు శివ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్కినేని శ్యామ్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
“ప్రజల సంక్షేమమే లక్ష్యం.. అభివృద్ధే ధ్యేయం..”










Leave a Reply