వ్యాపార నిర్వహణ సులభతరం చేయడమే ప్రధాన లక్ష్యం
హైదరాబాద్, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్ ప్రతినిధి:
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 7న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు శనివారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రజా విశ్వాసం బిల్లును ప్రవేశపెట్టింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జన్ విశ్వాస్ చట్టం తరహాలోనే రాష్ట్రంలో ప్రజా విశ్వాసం బిల్లును తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లును ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం శాసనసభలో ప్రవేశపెట్టారు.
రాష్ట్రంలో వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేయడం, పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, పాలనా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
వ్యాపార కార్యకలాపాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు, ప్రజలకు మరింత సమర్థవంతమైన, నమ్మకమైన పాలన అందించేందుకు ఈ బిల్లు దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు.
— అయుష్ 24 న్యూస్ ప్రతినిధి









Leave a Reply