చారిత్రక శిల్పకళా సంపదను పరిరక్షించి పూర్వ వైభవం తీసుకురావాలి: కేతావత్ రూప్ల నాయక్
దేవరకొండ, సెప్టెంబర్ 1, 2026 | అయుష్ 24 న్యూస్: దేవరకొండ ఖిల్లా దుర్గానికి సంబంధించిన చారిత్రక శిల్పకళా సంపదను పరిరక్షించాలని కోరుతూ 16వ వార్డు కౌన్సిలర్ కేతావత్ రూప్ల నాయక్ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ను కోరారు.
దేవరకొండ ఖిల్లా దుర్గంలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన శిల్పకళా విగ్రహాలను గతంలో భద్రపరిచే ఉద్దేశంతో తోపు ఫిరంగి ఎమ్మార్వో కార్యాలయంలో ఉంచారని కౌన్సిలర్ తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ విగ్రహాల చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయని, దీంతో వాటి రూపం దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
పార్కులో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
చారిత్రక శిల్పకళా సంపదను కాపాడుతూ వాటికి పూర్వ వైభవం తీసుకురావాలని, అనంతరం దేవరకొండ ఖిల్లా దుర్గంలోని పార్కులో విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కౌన్సిలర్ కేతావత్ రూప్ల నాయక్ కలెక్టర్‌ను కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చారిత్రక వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విగ్రహాలను రక్షించి, వాటి ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
స్పందించిన కలెక్టర్
కౌన్సిలర్ విజ్ఞప్తిపై జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై వెంటనే మున్సిపల్ కమిషనర్‌కు తగిన ఆదేశాలు జారీ చేస్తానని తెలిపారు.
కలెక్టర్ సానుకూలంగా స్పందించడంతో కౌన్సిలర్ కేతావత్ రూప్ల నాయక్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
అయుష్ 24 న్యూస్ 📰



Musini.Anjan





Leave a Reply