కుటుంబ సమేతంగా పాల్గొనాలని ఆహ్వానం
అయుష్ 24 న్యూస్ ప్రతినిధి, దేవరకొండ, సెప్టెంబర్ 08:
దేవరకొండ పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవస్థానంలో శ్రావణమాసం సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలకు కుటుంబ సమేతంగా హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతూ ఆలయ కమిటీ ప్రతినిధులు నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసిన ఆలయ కమిటీ ప్రతినిధులు శాలువాతో ఘనంగా సన్మానించి, శ్రావణమాస ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన వివరాలను కలెక్టర్‌కు వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, దేవస్థానం అధ్యక్షులు వనం జగదీశ్వర్, ఆలయ పెద్దలు చెరిపెల్లి ఎల్లయ్య, గాజుల రాజేష్, సిరిపోతు శ్రీరాములు, మాకం చంద్రమౌళి, వనం శ్రీనివాసులు, మాకం సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply