దేవరకొండ, ఆగస్టు 28 — అయుష్ 24 న్యూస్
యువత వ్యాపార రంగంలో రాణించి ఆర్థిక అభివృద్ధికి దోహదపడాలి
యువత వ్యాపార రంగంలో రాణిస్తూ తమతో పాటు సమాజం, ప్రాంత ఆర్థిక అభివృద్ధికి దోహదపడాలని దేవరకొండ మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు అన్నారు.
శుక్రవారం దేవరకొండ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర మెడికల్ హాల్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారుపాకుల సురేష్ గౌడ్, మెడికల్ హాల్ నిర్వాహకులు దువ్వ వెంకటేశ్వర్లు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పున్న శైలజ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దువ్వ వెంకటేశ్వర్లు మెడికల్ రంగంలో సుదీర్ఘకాలంగా అనుభవం సంపాదించారని, ఆ అనుభవంతో ప్రారంభించిన ఈ వ్యాపారం మంచి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. నాణ్యమైన మందులను సరసమైన ధరలకు ప్రజలకు అందించి వారి మన్ననలు పొందాలని సూచించారు. వ్యాపార రంగంలో యువత ముందుకు వచ్చి స్వయం ఉపాధితో పాటు మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని అన్నారు.

అనంతరం మెడికల్ హాల్‌లో ఏర్పాటు చేసిన ల్యాబ్‌ను మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. మెడికల్ హాల్ నిర్వాహకులు ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమం సందర్భంగా మెడికల్ హాల్ నిర్వాహకులు దువ్వ వెంకటేశ్వర్లు అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం చైర్మన్ చేరిపల్లి బాలరాజు, నాగవరం నిర్మల్ రావు, ఎనీమల్ల రమేష్, ఏలే వెంకటేశ్వర్లు, 10వ వార్డు కౌన్సిలర్ గుద్దేటి మాధవి సత్యం, 17వ వార్డు కౌన్సిలర్ పొట్ట మధు, మాజీ వార్డు సభ్యుడు పున్న శ్రీనివాసులు, జూలూరు గిరి, జెల్ల ఆంజనేయులు, దువ్వ గిరిబాబు, రిజ్వాన్, శివ, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply