- DCC అధ్యక్షుడి ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం
సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం AICC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సంగటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమం ఆగస్టు 17వ తేదీ నుంచి సంగారెడ్డిలో ప్రారంభం కానుంది.ఈ కార్యక్రమానికి సంబంధించిన ముందస్తు సమన్వయంలో భాగంగా గౌరవనీయ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ, నారాయణఖేడ్ శాసనసభ్యులు శ్రీ పట్లొల్ల సంజీవ రెడ్డి, DCC అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకత్వంతో TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సంగారెడ్డి TPCC పరిశీలకులు శ్రీ దుద్దిళ్ల శ్రీనుబాబు సమావేశమై కార్యక్రమ నిర్వహణ, సమన్వయంపై చర్చించారు.ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, AICC అబ్జర్వర్ శ్రీ దీపక్ రాథోడ్ ఆగస్టు 17న మీడియా సమావేశం నిర్వహించి ‘సంగటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమానికి అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు.కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.











Leave a Reply