సంగారెడ్డి జిల్లా, ఆగస్టు 26, అయుష్ 24 న్యూస్: సంగారెడ్డి నియోజకవర్గంలోని రెడ్లాస్ హోటల్‌లో బుధవారం నిర్వహించిన ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సంగారెడ్డి జిల్లా సంఘటన్ సృజన్ అభియాన్ పీసీసీ పరిశీలకులు దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎండీ రియాజ్, నేరెళ్ల శారద తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఏఐసీసీ పరిశీలకులు దీపక్ రాథౌర్తో కలిసి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి డీసీసీ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన అభిప్రాయాలను సేకరించారు. పార్టీ సంస్థాగత బలోపేతం, సమర్థవంతమైన నాయకత్వ ఎంపిక లక్ష్యంగా అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.










Leave a Reply