మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేసిన దేవరకొండ మండల సర్పంచుల ఫోరం
దేవరకొండ, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్:
సర్పంచుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేవరకొండ మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామాలకు ప్రథమ పౌరులుగా ప్రజలచే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
సర్పంచుల గౌరవ వేతనాన్ని నెలకు రూ.20 వేలకు పెంచాలని వారు కోరారు. అలాగే 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని రద్దు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులకు ఓటు హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
విధి నిర్వహణలో ఉన్న సర్పంచులు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.30 లక్షల ఆర్థిక సహాయం అందించాలని మంత్రిని కోరారు.
సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిశీలించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్, బెజ్జం సాయి, చాట్ల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్



Musini.Anjan





Leave a Reply