“Outstanding Public Service and Social Welfare Award” అందుకున్న జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్
విజయవాడ, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): ప్రజాసేవ, సామాజిక సంక్షేమం పట్ల అంకితభావంతో పనిచేస్తున్న జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డా. యుగంధర్ పొన్నకు మరో ప్రతిష్ఠాత్మక గౌరవం లభించింది.
విజయవాడ బెంజ్ సర్కిల్‌లోని ఏ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన Raj News Business Excellence Awards కార్యక్రమంలో ఆయనకు **“Outstanding Public Service and Social Welfare Award”**ను ప్రదానం చేశారు.
వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వ్యక్తులను సత్కరించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ చేతుల మీదుగా డా. యుగంధర్ పొన్న ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
ప్రజా సమస్యలపై స్పందిస్తూ, అవసరమైన వారికి అండగా నిలుస్తూ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పురస్కారాన్ని జనసేన పార్టీ కార్యకర్తలు, జనసైనికులకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజాసేవే లక్ష్యంగా మరిన్ని సంక్షేమ, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని డా. యుగంధర్ పొన్న తెలిపారు. ఆయనకు పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలిపారు.
“సేవే లక్ష్యం.. సమాజమే కుటుంబం.. ప్రజల సంక్షేమమే ప్రయాణం” అనే నినాదంతో ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.










Leave a Reply