గణపతి నవరాత్రి ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై చర్చ
మంథని, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంథని మున్సిపల్ పరిధిలోని పలు సమస్యలు, ప్రజలకు సంబంధించిన అంశాలపై సీపీతో చర్చించినట్లు చైర్మన్ తెలిపారు. ముఖ్యంగా మంథని పట్టణంలో నిర్వహించనున్న గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై చర్చించారు.
గణపతి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన భద్రతా చర్యలు, సమన్వయం వంటి అంశాలపై సీపీతో చర్చించినట్లు వొడ్నాల శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరినట్లు పేర్కొన్నారు.









Leave a Reply