నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు వేగంగా పూర్తి చేయాలని సూచన
దేవరకొండ, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:
దేవరకొండ పట్టణంలోని 7వ వార్డులో చేపడుతున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను 7వ వార్డు కౌన్సిలర్ హన్మంతు సాయి చంద్ర గౌడ్ బుధవారం పరిశీలించారు.

7వ వార్డులోని ఐసీడీఎస్ కార్యాలయం నుంచి తాటికోల్ రోడ్డు వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. నిర్మాణంలో ఉపయోగిస్తున్న పనుల నాణ్యత, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన కౌన్సిలర్.. నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో పనులు చేపట్టాలని సూచించారు.
రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత సిబ్బందిని కోరారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏశమోని మల్లేష్, తిరుపతయ్య, సూపర్‌వైజర్ కలీం తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply