రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని దేవరకొండ సీఐకి అందజేత
దేవరకొండ, ఆగస్టు 24 | అయుష్ 24 న్యూస్
నేరాల నియంత్రణ, నేర పరిశోధనలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని దేవరకొండ సీఐ వెంకట్ రెడ్డి అన్నారు. గ్రామాలు, తండాల నుంచి పట్టణాల వరకు సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా ప్రజలకు మరింత భద్రత కల్పించవచ్చని తెలిపారు.
సోమవారం సూర్య తండా సర్పంచ్ నేనావత్ కవిత లచ్చిరాం సహకారంతో గ్రామస్తుల నుంచి సేకరించిన రూ.50 వేల విరాళాన్ని సీసీ కెమెరాల ఏర్పాటుకు దేవరకొండ సీఐ వెంకట్ రెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కవిత లచ్చిరాం నాయక్ మాట్లాడుతూ నేర పరిశోధనలో సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. గ్రామంలో సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించి, వారి సహకారంతో విరాళాలు సేకరించినట్లు తెలిపారు.
గ్రామంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రతి తండాలో గ్రామపంచాయతీ కార్యాలయానికి అనుసంధానంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీసుల సహకారంతో గ్రామంలో మరిన్ని ప్రజా భద్రత కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోర్ర రవి నాయక్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply