Monday, 14 Sep 2026
14 Sep 2026Monday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › సెప్టెంబర్ 10 ‘చలో హైదరాబాద్’ నిరసనకు INTUC మద్దతు
బ్రేకింగ్ న్యూస్

సెప్టెంబర్ 10 ‘చలో హైదరాబాద్’ నిరసనకు INTUC మద్దతు

04:21 తెల్లవారుజాము AM

పెండింగ్ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్

హైదరాబాద్, సెప్టెంబర్ 07:
సెప్టెంబర్ 10న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ ర్యాలీకి ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC) పూర్తి మద్దతు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన చేపడుతున్నట్లు INTUC నేతలు తెలిపారు.

INTUC అధ్యక్షుడు డా. జి. సంజీవ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ ఉద్యమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రధాన డిమాండ్లు:

  • 2వ వేతన సవరణ సంఘం (PRC) సిఫార్సులను వెంటనే అమలు చేయాలి.
  • పెండింగ్‌లో ఉన్న ఆరు DA వాయిదాలను విడుదల చేయాలి.
  • CPSను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలి.
  • ఉద్యోగుల పెండింగ్ సంక్షేమ బిల్లులను పరిష్కరించాలి.
  • పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలి.
  • 104 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టుల ఉద్యోగ సమస్యలు, 8 నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సెప్టెంబర్ 10న జరిగే నిరసనలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, పెన్షనర్లు, అనుబంధ కార్మిక సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని డా. సంజీవ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి INTUC ఉపాధ్యక్షుడు జి. సత్యజిత్ రెడ్డి, ఆదిల్ షరీఫ్, విజయ్ కుమార్ యాదవ్, కాసిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి తదితరులు మద్దతు తెలిపారు.

అయుష్ 24 న్యూస్ ప్రతినిధి, హైదరాబాద్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 4🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
721 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *