టేకులపల్లి MRO, MPDO కార్యాలయాల్లో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ
టేకులపల్లి | అయుష్ 24 న్యూస్
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని టేకులపల్లి మండలంలోని MRO కార్యాలయం, MPDO కార్యాలయాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా MRO వీరభద్రం, MPDO శ్రీదేవి జాతీయ జెండాలను ఆవిష్కరించి, జాతీయ జెండాకు వందనం చేశారు. అనంతరం దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లక్కినేని శ్యామ్, ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ పాల్గొన్నారు. జాతీయ జెండాకు వందనం చేసిన అనంతరం ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుల సేవలను స్మరించుకుంటూ, దేశ ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

జై హింద్! జై భారత్! 🇮🇳
— అయుష్ 24 న్యూస్










Leave a Reply