హైదరాబాద్, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించారు.
అంబేద్కర్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన ఈ తిరంగా యాత్రలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ ప్రముఖ నాయకులతో కలిసి బీజేపీ పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ మారుతి కిరణ్ బూనేటి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాతీయ జెండాను చేతబూని దేశభక్తి నినాదాలతో నాయకులు, కార్యకర్తలు తిరంగా యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను చాటేలా ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
భారత్ మాతాకీ జై! 🇮🇳🚩










Leave a Reply